Monday, November 4, 2024
Homeనేషనల్Shraddha Walkar Murder Case: ప్ర‌తిరోజూ టార్చ‌రే.. శ్ర‌ద్ధా వీపుపై సిగ‌రేట్‌తో కాల్చేవాడు

Shraddha Walkar Murder Case: ప్ర‌తిరోజూ టార్చ‌రే.. శ్ర‌ద్ధా వీపుపై సిగ‌రేట్‌తో కాల్చేవాడు

Shraddha Walkar Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను పోలీసుల విచారిస్తున్నారు. పోలీసుల విచార‌ణ‌లో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. శ్ర‌ద్ధాను చంపి ఆ రాతంత్రా శ‌వం వ‌ద్ద గంజాయి తాగిన ఆఫ్తాబ్.. శ్ర‌ద్ధా బ‌తికున్న‌రోజుల్లో రోజూ న‌ర‌కం చూపించేవాడ‌ట‌. సైకోలా ప్ర‌వ‌ర్తించేవాడ‌ట‌. ప‌లుసార్లు శ్ర‌ద్ధా వీపుపై బ‌ట్ట‌లు తీసేసి సిగ‌రేట్ తో కాల్చేవాడ‌ని, ఈ విష‌యాన్ని త‌మ‌కు చెప్పుకొని శ్ర‌ద్ధా ప‌లుసార్లు ఏడ్చింద‌ని ఆమె స్నేహితులు పోలీసుల‌కు తెలిపారు. అయితే, శ్ర‌ద్ధాకు మాత్రం ఆఫ్తాబ్ అంటే ఇష్ట‌మ‌ని, అదీగాక త‌ల్లిదండ్రుల‌ను, కుటుంబ స‌భ్యులు వ‌ద్ద‌న్నా ఆఫ్తాబ్ ను న‌మ్ముకొని రావ‌టంతో సైకో దారుణ‌మైన క్రూర‌త్వాన్నిసైతం భ‌రించింద‌ని ఆమె స్నేహితులు పోలీసుల‌కు తెలిపిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -

శ్ర‌ద్ధాను పెళ్లిచేసుకొనే ఉద్దేశం లేద‌ని, కానీ పెళ్లిచేసుకుంటాన‌ని న‌మ్మించి ఆఫ్తాబ్ తీసుకొచ్చాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో వెల్లడ‌య్యే విష‌యాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఆఫ్తాబ్ ఢిల్లీలోని ఛ‌త్ర‌పూర్ ప్రాంతంలో కూడా ముందుగానే ప్లాన్ చేసి ఇల్లు తీసుకున్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఛ‌త్ర‌పూర్ ప్రాంతానికి స‌మీపంలోనే అట‌వీ ప్రాంతం ఉంది. ఇదంతా చూస్తుంటే పోలీసుల అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. అయితే, కోర్టులో మాత్రం శ్ర‌ద్ధాను క్ష‌ణికావేశంలో చంపాన‌ని ఆఫ్తాబ్ చెప్పాడు. శ్ర‌ద్ధా స్నేహితులు, శ్ర‌ద్ధ గ‌తంలో ఆఫ్తాబ్ పై పెట్టిన కేసును బ‌ట్టిచూస్తే శ్ర‌ద్ధానుత‌న‌తో తీసుకొచ్చిన కొద్దిరోజుల నుండే టార్చ‌ర్ పెట్ట‌డం మొద‌లు పెట్టిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఆఫ్తాబ్ ప‌లుసార్లు ప‌లు విధాలుగా స‌మాధానాలు చెబుతుండ‌టంతో కోర్టు అనుమ‌తిమేర‌కు పాలిగ్రాఫ్ ప‌రీక్ష ద్వారా అస‌లైన నిజాల‌ను రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గురువారం మ‌ధ్యాహ్నం 12గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీలోని ఓ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేట‌రీలో ఆఫ్తాబ్ కు పాలీగ్రాఫ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పోలీసులు హిందీలో ప్ర‌శ్న‌లు అడుగ్గా, నిందితుడు ఇంగ్లీష్ లో స‌మాధానాలు ఇచ్చిన‌ట్లు పోలీసుల వ‌ర్గాల ద్వారా తెలిసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News