చాగలమర్రి మండలంలో ఈనెల 10న ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నానిలు విస్తృతంగా పర్యటించి పలు గ్రామాల్లో 12 కోట్లతో చేపట్టిన వివిధ భారీ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని మండల వైయస్సార్ కాంగ్రెస్ కన్వీనర్ కుమార్ రెడ్డి, జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ షేక్ బాబూలాల్ తెలిపారు. మండలంలోని ఏం తండా, చక్రవర్తుల పల్లె, తోడేండ్ల పల్లె, ముత్యాలపాడు, ఓజీ తాండ, డి.కొత్తపల్లి, చాగలమర్రి, పెద్ద వంగలి, చిన్న వంగలి గ్రామాలలో సిమెంటు రోడ్లను ప్రారంభిస్తారు అన్నారు. అలాగే మండల కేంద్రమైన చాగలమర్రిలో గ్రామ సచివాలయ భావనాన్ని, పెద్దవంగలిలో రైతు భరోసా కేంద్రాన్ని డి వనిపెంటలో గ్రామ సచివాలయ భవనాన్ని, చెంచుగూడెం వద్ద భవనాసి నదిపై కొత్తగా నిర్మించిన వంతెనను వారు ప్రారంభిస్తారని వివరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.
Allagadda: 12 కోట్లతో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభం
చెంచుగూడెం వంతెన ప్రారంభం..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES