తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం దగ్గర నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా చాగలమర్రి మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్బాషా, టిడిపి బీసీ సెల్ స్పోక్ వర్షన్ సల్లా నాగరాజు మాట్లాడుతూ ఎటువంటి తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం వైసిపి భయానికి నిదర్శనమని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం తథ్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యం అని అన్నారు. ఈ దీక్షలో చాగలమర్రి నాయకులు కొలిమి హుస్సేన్ వలి గుత్తి నరసింహుడు అలంసాగర్ మౌలాలి సల్లాదనంజేయుడు గఫార్ సుబ్బారావు విరం రెడ్డి భాస్కర్ రెడ్డి రఫీ దిన్ మహబూబ్ బాషా బషీర్ షాభా టైలర్ భాష, చోటు, రామతీర్థం, కసినేని, ఓబులేసు, జోసెఫ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Allagadda: ‘మేము సైతం’ బాబు కోసం
రిలే నిరాహార దీక్షలో చాగలమర్రి నేతలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES