డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సూచనల మేరకు ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో సభ్యులకు సీట్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కేటాయించారు. సీనియారిటీ ప్రాతిపదికన సభలో ఎమ్మెల్యేలకు సీట్లు(MLA Seats)కేటాయింపు జరిగింది. సీట్ల కేటాయింపు విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చని స్పీకర్ సూచించారు.
ట్రెజరీ బెంచ్‌కు ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్‌లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మాజీ సీఎం, వైసీపీ శాసనసభా పక్షనేత జగన్‌కు బ్లాక్ 11లోని 202 నంబర్ సీటు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు బ్లాక్ 1లోని సీట్ 1 కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్‌కు బ్లాక్ 2లో 39 సీట్‌ను ఇచ్చారు. కాగా ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది.