Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Amaravathi: రాష్ట్రంలోని అన్ని సిసి కెమెరాలను వాడండి: సీఎస్   

Amaravathi: రాష్ట్రంలోని అన్ని సిసి కెమెరాలను వాడండి: సీఎస్   

రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిసి కెమెరాలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని దీనిపై ఒక సమగ్ర కార్యాచరణ నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్ రెడ్డి పోలీస్, రవాణా, ఆర్అండ్బి శాఖల అధికారులను ఆదేశించారు.   రాష్ట్ర సచివాలయంలో రహదారి భద్రతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.  ఈ సమావేశంలో ముందుగా గత ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంజూరు చేసిన పనుల ప్రగతిని సమీక్షించారు.  అనంతరం ప్రస్తుత సమావేశంలో ప్రతిపాదించిన వివిధ పనులకు సంబంధించిన అజెండా అంశాలను టిఆర్అండ్బి శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిఎస్ కు వివరించారు. ఈసందర్భంగా సిఎస్ డా. కేఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధానంగా రహదారి భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ ఆంక్షల ఉల్లంఘన నియంత్రణ తదితర లక్ష్యాలతో గతంలో కొనుగోలు చేసి అందుబాటులో ఉన్న సుమారు 60 వేల కెమెరాలను పూర్తి స్థాయిలో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక నివేదికను సమర్పించాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్త, రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు, టిఆర్అండ్బి సిఇ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News