Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Amzad Bhasha: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి

Amzad Bhasha: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి

ఒకపక్క సంక్షేమము మరొక అభివృద్ధి

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అందించి సంక్షేమ బాటలో దేశంలోనే మొదటి స్థానం సంపాదించిందని డిప్యూటీ సీఎం అంజాద్ భాష పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆళ్లగడ్డ నియోజకవర్గం రివ్యూ మీటింగ్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అధ్యక్షతన రాష్ట్ర జన వనరుల రాష్ట్ర సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి శాసన సభ్యులు గంగుల బిజేంద్రా రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జడ్పీ చైర్మన్ జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు మండల స్థాయి అధికారులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో చర్చ రివ్యూ మీటింగ్ జరిగింది.

- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా రాష్ట్రాన్ని విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చెందాలనే ప్రధాన ఆశయంతో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష స్పష్టం చేశారు. విద్యారంగం విషయానికొస్తే ముఖ్యమంత్రి తాను పేదలకు ఇవ్వగలిగే అస్తి ఏదైనా ఉందంటే అది కేవలం విద్య మాత్రమేనని ఎప్పుడు అంటుంటారని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పనుల ద్వారా రిలాంచింగ్ చేయడం డిజిటల్ విద్యను అందించేందుకు విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలను కేవలం తమ ప్రభుత్వ హయాంలోనే చేసి చూపించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష పేర్కొన్నారు.

వైద్యరంగా విషయానికొస్తే రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లను పేదలకు వైద్యం అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా 50వేల మంది వైద్య సిబ్బందిని నియామకం చేసి వైద్యానికి ఈరోజు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వ్యవసారంగానికి విషయానికి వస్తే రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆరుతడి పంటలను వేసుకోవాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితులు తొలగితే ప్రాజెక్టులలో జలకళ ఉంటుందని తద్వారా రాష్ట్రంలోని కాలువలకు నీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ భాష వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News