Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Ananthapuram: పెనుగొండ వైసీపీ అభ్యర్థిలో మార్పు రాదా?

Ananthapuram: పెనుగొండ వైసీపీ అభ్యర్థిలో మార్పు రాదా?

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రిలో ఎటువంటి మార్పు కనిపించ లేదని కళ్యాణదుర్గం ప్రజలు, పెనుగొండ ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రాయదుర్గం నియోజవర్గానికి చెందిన వైసిపి నాయకురాలు ప్రస్తుతం మంత్రి రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట ప్రాంతానికి చెందిన మహిళా నాయకురాలు. ఆమె తొలుత తెలుగుదేశం పార్టీలో మహిళా నాయకురాలుగా పని చేశారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఆ మహిళా నాయకురాలికి రాయదుర్గం ఎమ్మెల్యే టిడిపి టికెట్ రాకపోవడంతో ఆ మహిళా నాయకురాలు 2016 సంవత్సరంలో వైసిపి పార్టీలో చేరినట్లు సమాచారం.

- Advertisement -

2016లో ఆమె కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తూ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆమె భర్తకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో 2019లో కళ్యాణ్ దుర్గం వైసిపి ఇన్చార్జ్ గా పని చేస్తున్న మహిళకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 2022లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మార్పులు చేయడంతో వైసిపి మహిళా నేతకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఐదు సంవత్సరాల పాటు కళ్యాణ్ దుర్గం నియోజవర్గంలో ఆమె అవినీతి అక్రమాలకు పాటుపడినట్లు ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజా ప్రతినిధులతో పదవులు ఇవ్వడానికి డబ్బులు వసూలు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కనగానపల్లి మండలం తిప్పేపల్లి మద్దెల చెరువు గ్రామ సమీపాన వైసిపి మహిళా నేత 180 ఎకరాల నుండి 250 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ భూమి కూడా బినామీ పేర్లతో ఉన్నట్లు సమాచారం. వైసీపీ మహిళా నేత తీరు పట్ల పలుమార్లు వైసిపి నాయకులు కార్యకర్తలు ఆందోళనలు చేశారు. విలేకరులు ఆమెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెడతామని భయపెట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

పెనుకొండ నియోజవర్గంలోని పెనుకొండ, సోమందేపల్లి, పరిగి, రొద్దం, గోరంట్ల మండలాలకు సంబంధించిన విలేకరులతో సోమందపల్లి మండల సమీపంలో విలేకరులతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గతంలో ప్రముఖ పత్రిక, ప్రముఖ ఛానెళ్ల వారిని పిలిచేవారని అయితే ఇటీవల సోమందేపల్లి మండల కేంద్ర సమీపంలో పెనుగొండకు చెందిన వైసిపి ప్రజా ప్రతినిధుల సహకారంతో విలేకర్ల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రచార సభలకు విలేకరులకు అనుమతి ఉండదని కేవలం ఒక్క ఛానల్ మాత్రమే అనుమతి ఇస్తారని పలువురు ఇతర పాత్రికేయులు సమాచారాన్ని తెలియజేశారు. అయితే గురువారం పెనుగొండలో నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించారని, ఆ జన సమీకరణ కూడా ప్రజలకు డబ్బులు ఎరచూపి మద్యాన్ని అందజేసి జనాన్ని తరలించినట్లు సమాచారం పక్కాగా అందుతోంది.

ప్రజలు మాట్లాడిన వీడియోలు కూడా బహిరంగంగా వైరల్ అవుతున్నాయి. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వైసిపి మహిళా నేతకు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయల కార్లు ఎలా వచ్చాయని పలువురు కళ్యాణదుర్గం, పెనుగొండ ప్రాంతవాసులు చర్చించుకుంటున్నారు. గోరంట్ల మండలంలోని ఇద్దరు అగ్రవర్ణాల నాయకులు చెప్పిన విధంగా పెనుగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నడుచుకుంటారని మిగతా ఎవరు చెప్పినా వారి మాట వినరని కూడా టాక్ ఉంది. వైసిపి అభ్యర్థి బీసీ మహిళా నేత. వైసిపి అభ్యర్థి భర్త కూడా అగ్రకులానికి చెందిన వ్యక్తి కావటంతో పెనుగొండ వైసీపీ అభ్యర్థి అగ్రవర్ణాలు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉన్నారని పెనుగొండ నియోజకవర్గంలోని పెనుకొండ , రొద్దాం, పరిగి, సోమందపల్లికి చెందిన వైసిపి నేతలు కూడా ఆమెకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది వైసిపి నేతలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. మరి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పెనుగొండ వైసీపీ అభ్యర్థిలో ఇకనైనా మార్పు వస్తుందా లేదా అని పెనుగొండ నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News