సంక్షేమ పథకాల సారథిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకుంటే.. చంద్రబాబు నాయుడు పేరు చెబితే వెన్నుపోటు, కరువు గుర్తుకు వస్తుందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు. నార్పల మండలం బొందలవాడ, రంగాపురం, జంగంరెడ్డిపల్లి, గూగూడు, మూగేతిమ్మంపల్లి గ్రామాలలో “మన ఊరికి మన వీరా” కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి గడప గడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందగా టపాసులు కాల్చుతూ, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. గడప గడపకు తిరుగుతూ, జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల పెంపును ప్రజలకు వివరించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో పేద ప్రజల అభ్యున్నతికి మరింత సంక్షేమాన్ని చేకూరే విధంగా ఉందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. అదేబాటలో 2024లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేరుస్తారన్నారు. రెండు విడతల్లో పెన్షన్ రూ.3000 నుంచి రూ.3,500 వరకు పెంపు, వైయస్సార్ రైతు భరోసా సాయం రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతూ, ఏటా రూ. 16 వేల చొప్పున ఐదేళ్లలో రైతులకు ఒక్కొక్కరికి రూ.80 వేల చొప్పున సాయం చేయనున్నారు. ఇలా సంక్షేమాన్ని కొనసాగిస్తూ మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా మేనిఫెస్టోని రూపొందించడం పట్ల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న మాట ఇచ్చారు అంటే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు నెరవేర్చని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని వారిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరడం ఖాయం జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నారు.