ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు(10th Results) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 47.64శాతం ఉత్తీర్ణతో చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. అలాగే 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకాగా..19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరుగుతాయి. ఫలితాల కోసం http:// bse.ap.gov.in, http:// results.bse.ap.gov.inతో పాటు మన మిత్ర వాట్సాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
జిల్లాల వారిగా ఉత్తీర్ణత శాతం ఇలా..
