Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Government: నేతన్నలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government: నేతన్నలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Government: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంగళవారం చేనేత శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో అనేక చర్యలకు రూపురేఖలు రూపొందించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా హ్యాండ్లూమ్ వస్త్రాలపై కేంద్రం విధించిన జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరించాలని నిర్ణయించింది. అంటే, చేనేత వస్త్రాలపై వస్తు సేవల పన్ను (GST)ను వినియోగదారులపై మోపకుండా, రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించనుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటిగా చెప్పవచ్చు.

- Advertisement -

విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఊరట

చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అమలులోకి తేవాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. ఇది నేతన్నల భారం తగ్గించడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని కూడా నియంత్రించడంలో తోడ్పడనుంది.

నేతన్నల కోసం త్రిఫ్ట్ ఫండ్

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆర్థిక సాయంగా రూ. 5 కోట్లతో ‘త్రిఫ్ట్ ఫండ్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధిని జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్ట్ 7) నుంచి అమలులోకి తీసుకురావాలని సీఎం స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిధి నేతన్నల సంక్షేమాన్ని మెరుగుపరిచే దిశగా ఉపయోగపడనుంది.

చేనేత రంగం పునర్జీవనానికి శ్రీకారం

ఈ చర్యల వల్ల హ్యాండ్లూమ్ వస్త్రాలపై ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తక్కువ ధరల్లో ఉత్తమ నాణ్యత గల చేనేత వస్త్రాలు అందుబాటులోకి రావడం వల్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన నేతన్నలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. సమీక్షలో భాగంగా, ఏపీ చేనేత ఉత్పత్తులకు ఇటీవల వచ్చిన 10 జాతీయ అవార్డులను సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రదర్శించారు. వన్ డిస్ట్రిక్ – వన్ ప్రొడక్ట్ విభాగంలో అవార్డు పొందడం గర్వకారణంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad