Secretariat employees| ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బిగ్ షాక్ తగిలింది. ఏకంగా 15వేల మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డ్యూటీ సమయంలో ఉదయం పూట, సాయంత్రం పూట తప్పనిసరిగా అటెండెన్స్ యాప్‌లో ముఖ హాజరు వేయాలి. అయితే కొంతమంది బయోమెట్రిక్ రూల్స్ పాటించడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో వారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.
- Advertisement -
ఈ క్రమంలోనే గత 13 రోజులుగా బయోమెట్రిక్ వేయని ఉద్యోగులు 15వేల మంది ఉన్నట్లు గుర్తించింది. దీంతో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు బయోమెట్రిక్ వేయలేదని.. దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. మరోసారి ఇదే విధంగా రిపీట్ అయితే ఉద్యోగం నుంచి తీసివేస్తామని హెచ్చరించింది.