ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలే ఇళ్లు లేని పేదలకు ఇళ్ల కేటాయింపుపై సమీక్ష జరిగింది. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేలా, అమరావతిలో పేలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్లస్థలాలు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం కేటాయించారు, మొత్తం 20 లే అవుట్లలో ఈ స్థలాలున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి..ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు కేటాయించనున్నారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలను సర్కారు ఇవ్వనుంది. ఈమేరకు లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
AP: తీరనున్న పేదల కల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES