సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్(AP Cabinet) భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు హాజరైన ఈ భేటీలో కీలక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించారు. ముఖ్యంగా పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్‌లో మార్పు చేర్పుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
మరికొన్ని నిర్ణయాలు..
** పౌరసేవలు నేరుగా ప్రజలకు అందేలా చూసేలా కేడర్‌లో మార్పులకు నిర్ణయం
** కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం
** 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనకు ఆమోదం
** సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఉచిత భూకేటాయింపునకు ఆమోదం
** రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలకు ఉచిత భూకేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
** రాజమండ్రి పాత రైల్వే హ్యావలాక్ బ్రిడ్జి అభివృద్ధికి 116 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
** 2024-29 టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం
** మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 షాపుల కేటాయింపునకు ఆమోదం

