గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒకరుచొప్పున ఇప్పటికే జీబీఎస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. వరుసగా నమోదవుతున్న కేసులు ఆరోగ్యశాఖకు సవాలు విసురుతున్నాయి. ఇప్పటికే బర్డ్ ఫ్లూ కట్టడికి ఏపీలో తెగ కసరత్తు చేస్తున్నా ఇంకా అదుపులోకి రాకపోగా ఏకంగా మనిషికే ఇక్కడ బర్డ్ ఫ్లూ సోకింది.


గుంటూరు ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు సుమారు నలుగురు చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. జీబీఎస్ కేసులు వరుసగా నమోదవడంతో ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్న ఏపీ సర్కారు జేబీఎస్ గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పదేపదే చెబుతోంది.