Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వరదలు, తుపానులపై కూడా మాక్ డ్రిల్స్

AP: వరదలు, తుపానులపై కూడా మాక్ డ్రిల్స్

కెమికల్ ఎమర్జెన్సీ మాక్ ఎక్సర్ సైజ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -

జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఆఫ్ సైట్ ఫ్ట్ఫ్యాక్టరీస్, 6 జిల్లాల్లో ఆన్ సైట్ ఫ్యాక్టరీలలో కెమికల్ ఎమర్జన్సీ మాక్ ఎక్సర్‌సైజ్ సాగింది.
ఎన్డీఎంఎ ప్రతినిధి బ్రిగేడ్ బిఎస్ తకర్ మాట్లాడుతూ ఈ మాక్ఎక్సర్‌సైజ్ వల్ల కెమికల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏవిధంగా పరిశ్రమల యజమాన్యం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సత్వరం తీసుకోవాల్సిన చర్యలతో పాటు లోటుపాట్లు గురించి అధికారులకు అవగాహన కలుగుతుందన్నారు.
ముందస్తు అవగాహనా కార్యక్రమాలు, జాగ్రత్త చర్యలతో పాటు ప్రణాళికలు రూపొందించడం వల్ల రసాయనిక ప్రమాదాల స్థాయిని తగ్గించుకోవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. భవిష్యత్తులో వరదలు, తుపానుల మీద కూడా మాక్ డ్రిల్స్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని అంబేద్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News