AP Free Bus : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు శుభవార్త! ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్‌లో మధ్యాహ్నం 4 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇకపై ఏపీలోని అన్ని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదు, ఏపీ నివాసితులైతే చాలు.
ALSO READ: Pooja Hegde: పూజా హెగ్డే బ్యాడ్‌టైమ్ కంటిన్యూ – కూలీతో మారని బుట్టబొమ్మ లక్
ఏపీ ఆర్టీసీకి చెందిన 11,449 బస్సుల్లో 8,456 బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఫ్రీ ప్రయాణం. ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఈ సదుపాయం లేదు. మహిళలు బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ జీరో ఫేర్ టికెట్ ఇస్తారు. అవసరమైతే ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డు చూపించాలి.
ఈ పథకం ద్వారా ఏటా 1.42 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా. ఒక్కో కుటుంబానికి నెలకు సగటున రూ.4,000 మిగులుతుంది. పేద, మధ్యతరగతి మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం సులభంగా ప్రయాణించవచ్చు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి.
అయితే, ఇప్పటికే స్టూడెంట్ పాస్, మంత్లీ పాస్ తీసుకున్నవారికి 15 రోజుల తర్వాతే ఫ్రీ టికెట్లు. పాస్ గడువు ముగిసిన తర్వాత మాత్రమే జీరో టికెట్ ఇస్తారు. ఆర్టీసీ అధికారులు బస్సులను అప్‌గ్రేడ్ చేశారు, సాఫ్ట్‌వేర్ రెడీ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభావం పడకుండా ప్రభుత్వం సహాయం ఆలోచిస్తోంది.
సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణిస్తారు. ఈ పథకం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. మరిన్ని వివరాలకు ఆర్టీసీ వెబ్‌సైట్ చూడండి!


