మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టుపై తనకు ముందుగా గానీ, ఆతర్వాత గానీ ప్రభుత్వం తనకు ఏ విధమైన సమాచారమూ ఇవ్వకపోవడం పట్ల రాష్ట్రగవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అరెస్టు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా తనకు సమాచారంఇవ్వాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రజా ప్రతినిధులుగానీ, మాజీ మంత్రులు గానీ వారికి సంబంధించిన శాఖల్లో ఏదైనా అవినీతికిపాల్పడినట్టు తెలిస్తే ఆ విషయం గవర్నర్ కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆతర్వాతే వారిని అరెస్టు చేయాల్సి ఉంటుందని ఆయన భావిస్తున్నట్టుతెలిసింది. అంతేకాక, గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే విచారణప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, చంద్రబాబు అరెస్టుపై రాష్ట్ర ప్రభుత్వంఇంతవరకూ గవర్నర్ కు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ(సి) ప్రకారం చంద్రబాబును అరెస్టుచేయడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని న్యాయ నిపుణులుఅభిప్రాయపడుతున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమైన వ్యవహారమని, ఇదిఅక్రమ నిర్బంధం అవుతుందని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు. గవర్నర్అనుమతి తీసుకోని పక్షంలో దర్యాప్తులు, విచారణలు చెల్లవని కూడా వారుతెలిపారు. అంతేకాక, ఆయనను అరెస్టు చేసినందుకు పోలీసులపై చర్యతీసుకోవాల్సి ఉంటుందని కూడా వారు భావిస్తున్నారు.
AP Governor: చంద్రబాబు అరెస్టుపై గవర్నర్ విస్మయం
గవర్నర్ అనుమతి లేకపోతే విచారణలు, దర్యాప్తులు చెల్లుబాటు కావు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES