Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: ఆలయం లేని ఊరు ఉండకూడదు

AP Govt: ఆలయం లేని ఊరు ఉండకూడదు

రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదన్న ప్రాతిపదికన పెద్ద ఎత్తున దేవాలయాల నిర్మాణాలను చేపట్టిన్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సి.జి.ఎఫ్.కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నట్టు హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు రాష్ట్రంలోని పలు బడుగు, బలహీన వర్గాల ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి దేవాలయ నిర్మాణానికి టి.టి.డి. శ్రీవాణి ట్రస్టు అందజేసే రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఈ దేవాలయాల నిర్మాణానికి వినియోగించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన 1,330 దేవాలయలకు అదనంగా మరో 1,465 దేవాలయలను చేపట్టడమైందని ఆయన తెలిపారు.

- Advertisement -

నియోజక వర్గాల వారీగా మరో 200 దేవాలయాలు చేపట్టేందుకు ఆమోదం తెలినట్టు ఆయన వివరించారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 978 దేవాలయాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ప్రతి 25 దేవాలయాల నిర్మాణాల పనుల బాధ్యతలను ఒక సహాయక ఇంజనీరుకు అప్పగించినట్టు తెలిపారు.
అదే విధంగా పలు దేవాలయాల పునరుద్దరణకు మరియు ధూపదీప నైవేద్యాలకై మంజూరు చేసిన సి.జి.ఎఫ్. నిధులు రూ.270 కోట్లలో ఇప్పటికే రూ.238.19 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News