Mango Farmers: చిత్తూరు జిల్లా మామిడి పండ్ల రైతులకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం! ముఖ్యమంత్రి చంద్రబాబు మామిడి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వారి కోసం తాజాగా రూ. 260 కోట్ల నిధులను విడుదల చేసింది. సమస్యలతో సతమతమవుతున్న రైతులకు ఈ నిధులు ఎంతో ఊరట కలిగిస్తాయి.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులను తోతాపురి రైతులు పండించిన మామిడి కొనుగోలు కోసం వినియోగిస్తారు. రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల మామిడిని కొనాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సబ్సిడీ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెప్పారు. రైతులు తమ ఖాతాలను తనిఖీ చేసుకుంటూ ఉండాలని అంటున్నారు.
- Advertisement -
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.260 కోట్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఇదే విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ విజ్ఞప్తి మేరకు మామిడి కొనుగోళ్లు ఆగస్టు నెల వరకు కొనసాగనున్నాయి. ప్రాసెసర్లు మామిడి పండ్లకు కిలోకు రూ.8 నుంచి రూ.12 చొప్పున మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం కోరింది.


