ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేప్పట్టిన యువగళం పాదయాత్రకు ప్రజాదరణ ఉందని, లోకేష్ యాత్రను అడ్డుకునే ధైర్యం ప్రభుత్వనికి లేదని..ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర ఆగదని తెలుగు యువత జిల్లా అధికారి ప్రతినిధి సురేంద్ర అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర లో ఆయన పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గ ప్రధాన సమస్యలను వివరించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీస్ లను వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.
