Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష

AP: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న సీఎం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్‌ స్ధితి గతులను అడిగి తెలుసుకున్నారు.  ఎన్యుమరేషన్‌ జరుగుతోందని, ఏప్రిల్‌ మొదటి వారంలో నివేదిక ఖరారు చేస్తామని, ఏప్రిల్‌ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు.

రబీ సన్నాహకాలపై కూడా సీఎం సమీక్షించారు.  నాణ్యత లేని ఎరువులు, పురుగుమందులు,  కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.  ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు.   ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. 

పొలంబడి శిక్షణ, వ్యవసాయ పరికరాల పంపిణీ, రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.  యాంత్రీకరణ పెరిగేందుకు దోహద పడుతుందన్న సీఎం,  ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ చేయాలన్నారు.  జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్‌ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ, జులైలో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్‌ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ చేపట్టాలని, మిల్లెట్స్‌ సాగుపై చర్యలను కూడా ఆయన సమీక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News