AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి శనివారం అరెస్ట్ అయ్యారు. నేడు ఏసీబీ కోర్టులో అతడ్ని హాజరు పరచగా.. ఎంపీకి 14 రోజుల రిమాండ్ విధించింది. అతన్ని భారీ బందోబస్తు మధ్యన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం అనేక రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్ల అతడు శనివారం ఉదయం అతను సిట్ ముందు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు విచారించగా.. ఆ తర్వాత ఎంపీని అదుపులోకి తీసుకున్నారు.
ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహిరించిన మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యారు.


