Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Police : తప్పుడు వార్తలపై ఉక్కుపాదం! టెక్నాలజీతో ఏపీ పోలీసుల పోరాటం!

AP Police : తప్పుడు వార్తలపై ఉక్కుపాదం! టెక్నాలజీతో ఏపీ పోలీసుల పోరాటం!

Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు సమాచార యుద్ధంపై హోంమంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తప్పుడు వార్తలు, కల్పిత వీడియోల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తున్నారని ఆమె తెలిపారు. తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి, కొందరు వ్యక్తులు కల్పిత వీడియోలతో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఏపీ పోలీసులు సవాలుగా తీసుకుని తిప్పికొడుతున్నారని స్పష్టం చేశారు.

- Advertisement -

ఉత్తరప్రదేశ్ ‘రాళ్ల దాడి’ వీడియోను ఏపీలో జరిగినట్టుగా వైసీపీ ప్రచారం చేసిందని, అయితే ఏపీ పోలీసులు ఆ తప్పుడు కథనాన్ని వెంటనే ఛేదించి, ప్రజలకు వాస్తవాన్ని చేరవేశారని అనిత గుర్తుచేశారు. ఈ విధంగా, ఫేక్ న్యూస్‌పై పోలీసులు చూపుతున్న క్రియాశీలక వైఖరిని ఆమె ప్రశంసించారు.

తుళ్లూరు పోలీస్ స్టేషన్ ప్రారంభం
అమరావతి నిర్మాణంలో భాగంగా 2014లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారని హోంమంత్రి తెలిపారు. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యాలయాన్ని పూర్తి చేయకుండా అమరావతి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. “అమరావతి రాజధానిని రైతులు తమ కష్టంతో నిలబెట్టారు. ఆ రైతుల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాళ మనమంతా చూస్తున్నాం,” అంటూ అమరావతి ఉద్యమాన్ని ఆమె కొనియాడారు. రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలను పటిష్టం చేయడంలో ఈ నూతన కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలను ఎదుర్కొని, అమరావతి నిర్మాణానికి అండగా నిలవడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad