నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిమీ వేగంతో కదులుతున్న తీవ్రవాయుగుండం
ప్రస్తుతానికి ట్రింకోమలీకి 270 కి.మీ, నాగపట్నానానికి 300 కి.మీ, పుదుచ్చేరికి 340 కి.మీ, చెన్నైకి 380 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
రాగల 6 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం
రేపు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు,
మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
~ రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.