Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆత్మీయ వీడ్కోలు

AP: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆత్మీయ వీడ్కోలు

బిశ్వభూషన్‌ హరిచందన్‌ కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు ఇచ్చింది. చత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా వెళ్తున్నందుకు బిశ్వభూషణ్ కు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆత్మీయుడైన పెద్దమనిషిగా, గవర్నర్‌ వ్యవస్ధకు ఒక నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు.
హరిచందన్‌ గవర్నర్‌గా ఉన్న ఈ మూడు సంవత్సరాల కాలంలో రాజ్యాంగ వ్యవస్ధల మధ్య ఉండాల్సిన సమన్వయం అన్నది ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారన్నారు సీఎం. తండ్రిలా, పెద్దలా ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడి ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ మన గవర్నర్‌ వాత్సల్యం చూపించారని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News