Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

AP: ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

"ఆపరేషన్ స్వేచ్ఛ-II" అనే వినూత్న కార్యక్రమం ఒక నెల రోజులు పాటు అన్ని జిల్లాల్లో చేపట్టనున్నారు

“ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం” సందర్బంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ నేర దర్యాఫ్తు విభాగము (సి . ఐ . డి ) వారు ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు “ఆపరేషన్ స్వేచ్ఛ-II” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజులు పాటు అనగా ఈనెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని పోలీస్, ఇతర శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సి . ఐ . డి ప్రధాన కార్యాలయం మంగళగిరి లో సి.ఐ.డి. అడిషనల్ డి.జి.పి. శ్రీ సంజయ్, ఐ.పి.యస్ బాల కార్మికులకు వ్యతిరేకంగా ఒక పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీ సంజయ్, ఐ.పి.యస్ గారు మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ స్వేచ్ఛా ఫేజ్-1కి కొనసాగింపు. ఫేజ్-I సమయంలో, CID పిల్లలను రక్షించడానికి గణనీయమైన ప్రయత్నాలు చేసింది, దీనికి ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం నుండి ప్రశంసలు లభించాయని తెలియజేసారు, అంతేకాకుండా , ఆపరేషన్ స్వేచ్ఛా ఫేజ్-II ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 326 మంది పిల్లలను రెస్కు చేసారని, వీరిలో 289 మంది బాలురు, 37 మంది బాలికలు, రాష్ట్రవ్యాప్తంగా 45 మంది పిల్లలను చైల్డ్ కేర్ హోమ్‌లకు పంపగా, 281 మంది పిల్లలను వారి తల్లిదండ్రులతో కలపడానికి సిఐడి కృషి చేసిందని తెలియజేసారు.

- Advertisement -

ఆపరేషన్ స్వేచ్ఛ-II కోసం, శ్రీమతి కె.జి.వి. సరిత, ఎస్పీ సి.ఐ.డి. మహిళా సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కాంట్రొల్ రూము ఏర్పాటు చేసి రోజువారీ ఎంతమంది పిల్లలను బాలకార్మిక వ్యవస్థ నుండి విముక్తి కలిగించారు ఇంకా ఎంతమంది పిల్లలను వారి తల్లి తండ్రులకు లేదా సంరక్షణా గృహాలలో అప్పగించారు తదితర విశేషాలను జిల్లా అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి, సి.ఐ.డి. ఎస్పీ శ్రీమతి కె.జి.వి. సరిత గారు, సి.ఐ.డి. ఉన్నతాధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమీషనర్ A. గణేశన్, చైల్డ్ రైట్స్ అడ్వొకేసీ ఫౌండేషన్ స్టేట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబీ, బచ్పన్ బచావో ఆందోలన్ స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతి రావు ఇంకా ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ నుండి ప్రతినిధులు క్లెమెంట్ డేవిడ్, శ్రీమతి గ్లోరీ మూర్తి, కావూరి నవీన్ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News