ఈ ఎన్నికల్లో బనగానపల్లె ఎమ్మెల్యేగా మరోసారి కాటసాని రామిరెడ్డికి ఓటు వేసి, గెలిపించి సీఎం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని కాటసాని సతీమణి కాటసాని జయమ్మ అన్నారు. ఆమె బనగానపల్లి మండలం యనకండ్ల గ్రామంలో బనగానపల్లె వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపు కొరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.
మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ రోజున బనగానపల్లె వైయస్సార్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా సాయంత్రం ఆమె గ్రామానికి చేరుకున్న వెంటనే గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాటసాని జయమ్మ మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పని నేతగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.