Sunday, May 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: తోగూర్ ఆర్థర్ నామినేషన్ దాఖలు

Nandikotkuru: తోగూర్ ఆర్థర్ నామినేషన్ దాఖలు

భారీ ర్యాలీతో..

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ కూటమి సభ్యులతో కలిసి స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాస్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ పగిద్యాల రోడ్డు మార్గంలో ఉన్న బ్రహ్మంగారి మఠం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం నియోజవర్గ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి స్థానిక పటేల్ సెంటర్ నందు కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాల అంశాలపై ప్రసంగించారు.

- Advertisement -

నియోజవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పదవీ కాలంలో నియోజవర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డానని, నేడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచినట్టు వివరించారు. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నన్ను అదే ఆశీర్వాదంతో పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News