బండిఆత్మకూరు మండలంలోని యర్రగంట్ల గ్రామంలో నిర్వహించిన 93వ రోజు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం శాసన సభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మెహన్ రెడ్డి ప్రతి పేదవాని కుటుంబానికి భరోసాగా ఉంటూ గడప గడపలో సంతోషాన్ని నింపారని ఎమ్మెల్యే అన్నారు. ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు ఎమ్మెల్యే శిల్పాను శాలువాలతో సత్కరించి పూలతో స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే శిల్పా గ్రామంలోని పలు వీధుల్లోని ప్రతి గడప – గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి, స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈసంక్షేమం, అభ్యున్నతికై వైయస్ జగన్ కృషి చేస్తున్నారని సంక్షేమ ఫలాలతో రాష్ట్రంలో నిరుపేద వ్యవస్థ నిర్మూలన అవుతుందని ఎమ్మెల్యే శిల్పా తెలిపారు. సచివాలయ -వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాలను ఇంటి ముంగిటకే అందిస్తున్నారని చెప్పారు, ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునేల ఆదేశించారు.ఈ కార్యక్రమంలో శ్రీశైల సమన్వయ కర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, ఎంపీడీఓ వాసుదేవగుప్తా, వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
Bandiathmakuru: సంక్షేమ ఫలాలతో పేదరికం నిర్మూలన: శిల్పా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES