రాష్ట్రంలో ఉగాది నుండి మహిళలు కోసం ఉచిత బస్సు పథకం సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ పథకం అమలును పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం శుక్రవారం బెంగుళూర్ కు చేరుకుంది. పుంగనూరు దేశం ఇన్చార్జి చల్లా రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం పలికారు.
- Advertisement -
ఈ బృందం సాయంత్రం కర్నాటక రాష్ట్ర రవాణా మంత్రి రామలింగారెడ్డితో భేటి కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర మంత్రులతో పాటు, కర్నాటక రాష్ట్ర రవాణా శాఖా అధికారులు పాల్గొనున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమలు విధానాన్ని సమీక్షిస్తారు.