బేతంచెర్ల మండలం హెచ్. కొట్టాల స్టేజి దగ్గర జాతీయ రహదారినెంబర్ 340బిని,630కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ జాతీయరహదారి సోమయాజులపల్లె నుండి బేతంచెర్ల మీదుగా డోన్ వరకు సుమారుగా 53 కిలోమీటర్ల పైబడి ఎన్.హెచ్.రోడ్ నిర్మాణం జరుగుతుందని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. బేతంచెర్ల జగనన్న కాలనీకి 99.50 లక్షల వ్యయంతో నూతనంగా రహదారి వంతెనను కూడా బుగ్గన ప్రారంభించారు. మంత్రితో పాటు జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానిసామూన్, ఆర్డిఓ వెంకటరెడ్డి, నేషనల్ హైవే ఈఈ ఇందిర, డీస్పీ శ్రీనివాసులురెడ్డి, బేతంచెర్లసీఐ ప్రియతం రెడ్డి, బేతంచెర్ల మండలస్థాయి అధికారులు, బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు శివలక్ష్మి,బేతంచెర్ల నగరపంచాయితి చైర్మన్ సిహెచ్ చలంరెడ్డి,హెచ్. కొట్టాల ఎంపీటీసీ సభ్యురాలు రత్నమ్మ, హెచ్. కొట్టాల సర్పంచ్ వి. వెంకటలక్ష్మమ్మ, వైసీపీ సీనియర్ నాయకులుబాబురెడ్డి,బుగ్గనచంద్రారెడ్డి,ఖాజాహుసేన్, మూర్తుజావలి, శ్రీమద్దిలేటి స్వామి ఆలయపాలకమండలిచైర్మన్ సీతారామచంద్రుడు, ఇబ్రహీం, మండల ప్రాదేశిక సభ్యులు, వివిధగ్రామాలసర్పంచులు, వైసీపీముఖ్యనాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Bethamcharla: పలు కార్యక్రమాలు ప్రారంభించిన బుగ్గన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES