Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla TDP: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీ, ధర్నా

Bethamcharla TDP: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీ, ధర్నా

బేతంచెర్ల పట్టణంలో టీడీపీ మండల కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి పాత బస్ స్టాండ్ లో ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి నంద్యాల పార్లమెంట్ స్థాయి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ, బాబు ష్యురిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో కార్యక్రమం ముగించుకొని, నిద్రిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవశాలియైన నారాచంద్రబాబు నాయుడును శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.

- Advertisement -

టీడీపీ నాయకులు కె. తిరుమలేష్ చౌదరి,షేక్షావలి చౌదరి, రాఘవ రెడ్డి, ఆపతి ప్రతాప్, ఉన్నం చంద్రశేఖర్, లోకేశ్ గౌడ్, రవీంద్ర నాయక్, ఉన్నం సుధాకర్, బుగ్గానిపల్లె రమేష్, మేకల నాగరాజు, రూబెన్, టైలర్ రాముడులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా, చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించడం చట్ట విరుద్ధమైన చర్య అనిన్నారు. ముక్త కంఠంతో టీడీపీ ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబాపురం గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు యాదవ్, బుక్కాపురం గ్రామ సర్పంచ్ నాగరాజు, వార్డు కౌన్సిలర్లు రామ్ గోపాల్, రామాంజనేయులు రామ్ముర్తి, నంద్యాల మధు, చంద్ర, గూటం శివ, రామవరం శివ, కానాల అంజి, శ్రీనివాసులు గౌడ్, రామకృష్ణ, విజయ్ కుమార్, లొడ్డ శేఖర్, నల్లాడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News