టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు బేతంచెర్ల పట్టణంలో టీడీపీ నాయకులు బేతంచెర్ల పట్టణం టీడీపీ కార్యాలయం నుండి పాత బస్స్టాండ్ వరకు ర్యాలీని ఉన్నం ఎల్ల నాగయ్య, షేక్షావలి చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించి, చంద్రబాబును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు చేయాలని, ప్రభుత్వ మోస పూరిత విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు అయ్యేంత వరకు ఆందోళన చేస్తామని, అరెస్టులకు వెనుకాడబోమని హెచ్చరించారు.
టీడీపీ ఆందోళనకు మద్దతుగా జనసేన నాయకులు చల్ల మద్దిలేటీ స్వామి, ఎంఆర్పిఎస్ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు అనిల్ మాదిగ, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో పాటు జనసేన, ఎంఆర్పిఎస్ నాయకులను బేతంచెర్ల ఎస్ఐ. శివశంకర్ నాయక్ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.