రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని బేతంచెర్ల వడ్డెర సంఘం నాయకులు కలిశారు. బేతంచర్లలోని మంత్రి స్వగృహంలో ఈ భేటీ జరిగింది. శ్రీ శైల దేవస్థానం అఖిల భారత వడ్డె వడ్డెర వడియారాజుల నిత్యాన్న దాన సత్రం కమిటీ సభ్యుడు మక్కల సుబ్బరాయుడు మంత్రితో మాట్లాడుతూ, మా వడ్డెర జాతి వెనుక బడిన కులము (బి.సి – ఎ) నుండి ఎస్టి జాబితాలో చేర్చుటకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, మాకులము బాగు కొరకు తెలియజేయాలని కోరారు. వడ్డెర జనాభా సుమారు 30 లక్షలు కలరని, పూర్తిగా వెనుకబడిన మాకు విద్య, ఉపాధి, ఉద్యోగ, సామాజిక, ఆర్ధిక రంగాలలో పూర్తిగా వెనుక పడివారమని ఎస్టి రిజర్వేషన్ కల్పిస్తే మాకులం ఈ సమాజంలో బాగుపడు అవకాశం ఉన్నదని, రాళ్లు కొట్టి, కొండలను పిండిచేసి, ఎంతో నైపూణ్యతతో రాళ్ళను శిల్పాలుగా మలిచి, జీవితం రాళ్ళ మధ్యలోనే గడుపుతూ, శక్తి నంతా రాళ్ల పనులలోనే ధారపోసి, కృషించి, 50 సంవత్సరాలకే ముసలితనంలోకి వెళ్ళుతున్న వడ్డెర్లకు 50 సంవత్సరాలు నిండిన వడ్డెర స్త్రీ, పురుషులకు పెన్షన్ సౌఖర్యం కల్పించాలని, ఇల్లు లేని వడ్డెర్లకు ఇండ్లు కట్టివ్వాలని, వడ్డెర కార్పొరేషన్ ద్వారా ఎటువంటి పూచ్చికత్తు లేకుండా లోన్ సౌఖర్యం కల్పించాలని, చదువుకుంటున్న వడ్డెర విద్యార్థిని, విద్యార్థులకు ఎటువంటి ఫీజులు లేకుండా విద్యను ప్రభుత్వం కల్పించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం సీనియర్ నాయకులు చల్ల రామ పుల్లయ్య, మండల అధ్యక్షులు దేరంగుల సుబ్బరాయుడు, వడ్డెర సంఘం డివిజన్ నాయకులు చల్ల శివ,పెద్ది రాజు, దండగల లాలెప్ప, మద్దయ్య, రంగడు తదితర వడ్డెర్లు పాల్గొన్నారు.
Bethamcharla: మంత్రి బుగ్గనను కలిసిన వడ్డెర నాయకులు
50 ఏళ్లకే వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొనే వడ్డెర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES