ఆళ్లగడ్డ నియోజకవర్గం టిడిపి పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్ధానిక శ్రీరామ ఫంక్షన్ నిర్వహించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో నవంబర్ 1 నుండి 45 రోజులపాటు ప్రజాక్షేత్రంలో పర్యటించనున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. పార్టీ రూపొందించిన మినీ మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకొని వెళ్లి మీ భవిష్యత్తుకు బాబు భరోసా కార్యక్రమాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తామన్నారు. మినీ మేనిఫెస్టోలో రూపొందించిన పథకాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తామన్నారు. స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి ద్వారా ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కల్పించిన భరోసాను ప్రజలలోకి తీసుకొని వెళ్లడం ఒక్కో ఇంటికి కలిగే ప్రయోజనాలను వివరించడం తమ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ హామీ ఇచ్చారు.
యువ నేత భూమా జగద్విఖ్యాత రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ప్రతి భూమా కార్యకర్తకు అందుబాటులో ఉండి పని చేస్తామని కార్యకర్తలు ఎక్కడ రాదని ఆళ్లగడ్డలో అఖిలప్రియ ఎమ్మెల్యేగా మళ్లీ భూమా జెండాను ఎగురవేస్తామని కార్యకర్తల హర్షద్వానాల నడుమ ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ భూమా బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ హుస్సేన్ భాష, కూడాల నారాయణరెడ్డి మాజీ సర్పంచ్ ఆన్సర్ బాష, జాఫర్ రెడ్డి, న్యాయవాది నరసింహారెడ్డి, అనంతరామసుబ్బారెడ్డి , మాజీ జెడ్పిటిసి చాంద్ బాషా, యామా సల్లా నాగరాజు, రంగయ్య, మెట్ల భాస్కర్, అహోబిలం రమణ, రాజారావు పాల్గొన్నారు.