వైసిపి ప్రభుత్వం కక్ష్య సాధింపుతోనే తమ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించిందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బాబుకి తోడుగా మేము సైతం అనే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ముత్తలూరు గ్రామంలో ఆమె ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న జనార్ధనం చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేయించడం జరిగిందని వైసీపీ నాయకుల అరాచకాలను రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పాలని అందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలుగుదేశం నాయకులపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని ఇటువంటి అరాచకాలు అక్రమ అరెస్టులకు టిడిపి నాయకులు భయపడేది లేదని అన్నారు. బాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు వివరిస్తున్నామని బాబును విడుదల చేయాలని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి టిడిపి నాయకులు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకు రావడం జరుగుతుందని. రానున్న ఎన్నికలలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ సుబ్బారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Bhuma Akhila: రాజకీయ కక్షలతో చంద్రబాబు అరెస్ట్
రుద్రవరం ఇంటింటికి తిరిగిన భూమా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES