Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma: కేసులు ఉపసంహరించుకునేదాకా పోరాటం

Bhuma: కేసులు ఉపసంహరించుకునేదాకా పోరాటం

5వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం వద్ద బాబుకు తోడుగా మేము సైతం అంటూ 5 రోజు కూడా రిలే నిరాహార దీక్షలలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ టిడిపి యువ నాయకుడు విఖ్యాత రెడ్డి ఉయ్యాలవాడ దొర్నిపాడు టిడిపి నాయకులతో కలిసి రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును అందరూ ఖండిస్తున్నారని. చెయ్యని నేరానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణితో అరెస్టు చేయించారన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ విపరీతమైన క్రేజీ రావడంతో పక్కదారి పట్టించేందుకే జగన్ ఒక ప్లాన్ గా చంద్రబాబును అరెస్టు చేయించారు అన్నారు. ఈ అరెస్టులు ఇవన్నీ మాకు కొత్త కాదని అరెస్టులకు భయపడే టిడిపి కార్యకర్తలు నాయకులు ఎవరూ లేరని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు ని విడుదల చేసింతవరకు తమ పోరాటాలు ఆగవని రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా లక్షల మందితో దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అనంత రామ సుబ్బారెడ్డి, సిద్ధి సత్యనారాయణ, జిల్లా సుబ్బరాయుడు, శివయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News