Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: అభివృద్ధి కార్యక్రమాల్లో బాలనాగిరెడ్డి

Mantralayam: అభివృద్ధి కార్యక్రమాల్లో బాలనాగిరెడ్డి

కల్లుకుంట,ముచ్చిగిరి, నౌలేకల్ గ్రామాలలో ప్రారంభోత్సవాలు

కల్లుకుంట గ్రామంలో గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో మంజూరైన 20,లక్షలతో తాగునీటి పైప్ లైన్ కు ఆదివారం మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పూజా కార్యక్రమం సర్పంచ్ ఇస్మాయిల్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో గడపగడప కార్యక్రమంలో మంజూరైన 20.లక్షల నిధులతో తాగునీటి పైప్ లైన్లకు పూజా కార్యక్రమం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్,గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి,మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ రామాంజనేయులు, రవిచంద్ర రెడ్డి, రఘురాం,శివారెడ్డి, గజేంద్ర రెడ్డి,దొడ్డి మేకల సర్పంచ్ చంద్రశేఖర్,జాము మూకయ్య, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.అనంతరం ముచ్చిగిరి గ్రామంలో జలజీవన్ మిషన్ కింద 27,33 లక్షల వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఆర్ ట్యాంక్ ను ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయికుమార్,జాము మూకయ్య గ్రామ సర్పంచ్ హనుమంతు ఆధ్వర్యంలో ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి శిలాఫలకమును ప్రారంభించడం జరిగింది.అలాగే నాడు నేడు కింద 14 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి కేంద్రమును ఎంపీపీ శ్రీవిద్య, జడ్పిటిసి జాము రాజేశ్వరి,ఐసిడిఎస్ సూపర్వైజర్లు వీర గోవిందమ్మ,విజయ్ కుమారి ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది.మరియు నౌలేకల్ గ్రామం లో వైయస్సార్ హెల్త్ క్లినిక్ 17,50 లక్షలు మంజూరైన నిధులతో వైయస్సార్ హెల్త్ క్లినిక్ గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ గౌడ్,కాంట్రాక్టర్ వెంకటేష్, వైద్యాధికారిణి శాంతి జ్యోతి,ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు వైసిపి తోనే సాధ్యమని ప్రారంభించిన కార్యాలయాలను సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వీరేంద్ర గౌడ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి,మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పిటిసి జాము రాజేశ్వరి,ఎంపీపీ శ్రీవిద్య, రఘురాం,రవిచంద్ర రెడ్డి,గజేంద్ర రెడ్డి,శివ రెడ్డి,దొడ్డిమేకల సర్పంచ్ చంద్రశేఖర్, జాము మూకయ్య, కల్లుకుంట సర్పంచ్ ఇస్మాయిల్,వైస్ ఎంపీపీ ఇర్ఫాన్ దేశాయ్,సత్య గౌడ్,డీలర్ నరసింహులు,డీలర్ ఉచ్చప్ప,టీ.తిక్కన్న, ముచ్చిగిరి సర్పంచ్ హనుమంతు,డీలర్ నాగప్ప,తిక్కన్న, నౌలేకల్ గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ గౌడ్,వైస్ సర్పంచ్ హనుమప్ప, ఆంజనేయ, హనుమంతు,కొండన్న, డీలర్ నాగరాజు, శరణప్ప,మానేప్ప, మాబు సబ్ తాత, వెంకటేశులు,కోస్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అర్లప్ప, ముక్కరన్న,పులికని సర్పంచ్ చిన్న మహదేవ్ చిన్న తుంబలం,చిన్న వీరేష్, డీలర్ కడబూరి, లక్ష్మన్న,వివిధ గ్రామాల సర్పంచులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News