వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan)పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(AdiNarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ చేయాలని జగన్ సొంత సోదరి షర్మిల చెబుతుందన్నారు. బీజేపీతో పెట్టుకుంటే ఏమవుతుంతో త్వరలోనే చూపిస్తామని హెచ్చరించారు. రాజకీయాల్లో జగన్‌ను లేకుండా చేయడమే తమ ధ్యేయం అని హాట్ కామెంట్స్ చేశారు.
కాగా లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఓఎస్టీగా పనిచేసిన ధనుంజయరెడ్డి, సీఎంవో కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప కూడా అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ కేసుకు సంబంధించి అంతిమ లబ్ధిదారుగా ఉన్న జగన్ అరెస్ట్ అవ్వబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.