వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి(Jagan Mohan Reddy) జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(Adinarayana Reddy)వార్నింగ్ ఇచ్చారు. కడప జిల్లా చిలంకూరు ఎల్‌అండ్‌టీ సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన వివాదంపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలను మామూళ్ల కోసం, కాంట్రాక్టుల కోసం బెదిరిస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ కూడా విసిరారు.
జమ్ముకశ్మీర్ టెర్రరిస్టుల కంటే వైసీపీ వాళ్లు చాలా డేంజర్ అంటూ మండిపడ్డారు. అందుకే జగన్‌ను రాజకీయాల నుంచి లేకుండా చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే వైసీపీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డి దొరికాడని త్వరలోనే జగన్ సహా అందరి బండారం బయటపడుతుందన్నారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు, ఈకలు ఏం ఉంటాయంటూ విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావని ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు.