Saturday, September 30, 2023
Homeఆంధ్రప్రదేశ్Budda Rajasekhar: రాష్ట్రానికి విఘ్నాలు తొలగాలి

Budda Rajasekhar: రాష్ట్రానికి విఘ్నాలు తొలగాలి

ప్రత్యేక పూజలు చేసిన బుడ్డా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు తొలగిపోవాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శ్రీశైలం నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో 6వ రోజు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి గణేషుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. సైకో సీఎం జగన్ మోహన్ రెడ్డి కుట్రపూరితంగా నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు తొలగిపోయి, ఈ రాష్ట్రానికి జగన్ అనే విఘ్నం నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వినాయక స్వామి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఈ నిరసన దీక్షకు సి.పి.ఎం పార్టీ నాయకులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బన్నురు రామలింగ రెడ్డి, అన్నారపు శేష రెడ్డి, యుగంధర్ రెడ్డి, వేణు గోపాల్, శివ ప్రసాద్ రెడ్డి, ఉల్లి మధు, మల్లేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్, సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అబ్దుల్లాపూరం బాషా, బాలయ్య, రాజా రెడ్డి, రామకృష్ణ, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News