Sunday, December 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రుల కమిటీ

Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రుల కమిటీ

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు(Free Buse Scheme) ప్రయాణ పథకంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది. రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీలో కన్వీనర్‌గా రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణికి చోటు కల్పించింది.

- Advertisement -

కాగా ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని మహిళలు ఈ పథకం అమలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఉచిత బస్సు పథకం ఎప్పడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News