Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri Muharram: చాగలమర్రిలో ప్రారంభమైన మొహరం వేడుకలు

Chagalamarri Muharram: చాగలమర్రిలో ప్రారంభమైన మొహరం వేడుకలు

పీర్లను కూర్చోబెట్టి ఫాతేహాలు సమర్పించి, తమ కోర్కెలు నెరవేరితే ముడుపులు చెల్లిస్తారు

తెలుగు రాష్ట్రాల్లో మొహరం అంటే అది హైదరాబాద్, చాగలమర్రి అనేంతలా ఇక్కడి వేడుకలు ప్రఖ్యాతిగాంచాయి. చాగలమర్రిలో జరిపే మొహరం వేడుకల గురించి తెలుగుప్రభ ప్రత్యేక కథనం..

- Advertisement -

ముహర్రం అంటేనే వీరుల త్యాగానికి ప్రతీక. రాయలసీమలో దీన్ని పీర్ల పండుగ అంటారు. నిజానికి హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీక మొహర్రం పండుగ. పెద్ద ఎత్తున హిందువులు, ముస్లింలు కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకోవటం విశేషం. గ్రామాల్లో, పట్టణాలు, నగరాల్లో జరిగే మొహర్రం పిల్లా పెద్దలకు ఆనందం పంచుతుంది. ఇక నంద్యాల జిల్లాలోని చాగలమర్రి గ్రామంలో హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు జరిగే ఈ సంతాప దినాలు పదవ రోజు లాల్ స్వామి పీర్ తో ముగుస్తాయి.

  • వివరాల్లోకి వెళితే…
    హిందువులకు చైత్రం మాసం, క్రిస్టియన్లకు జనవరి మాసం ప్రారంభ మాసం ఎలాగో, ఆ విధంగా ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులకు మొహ్రరం నెలతో తొలి మాసం ప్రారంభమవుతుంది. హిజరీ శకం ప్రకారం 1444 సంవత్సరం జులహిజ్ చివరి మాసం ముగిసిన వెంటనే చాంద్రమాన కాలాన్ని పాటించే ముస్లింలకు మొహర్రం నెలలో నెలవంక కనిపించగానే 1445 సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే 14 వందల సంవత్సరాల క్రితం ఇదే నెలలో ప్రస్తుత ఇరాక్లోని కర్బలాలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం మహమ్మద్ ప్రవక్త మనుమలైన హజ్రత్ ఇమాం హుస్సేన్ కుటుంబీకులు యజీద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 10 రోజులపాటు వీరోచిత పోరాటం చేసి అసువులు బాసిన నెల. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం నూతన సంవత్సరం ప్రథమ మాసం మొహర్రం అయినప్పటికి ఇదే నెలలో ధర్మపరిరక్షణ కోసం హజ్రత్ ఇమాం హుస్సేన్ కుటుంబీకులు కర్బలాలో పదిరోజుల పాటు జరిగన యుద్ధంలో వీరమరణం పొందటంతో వారి త్యాగనిరతికి సంతాప సూచకంగా వారిని గుర్తుకు చేసుకుంటూ పదిరోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. అషూర్కానాలో యుద్ధం వీరమరణం పొందిన హజ్రత్ ఇమాం హుస్సేన్ వారి కుటుంబీకుల పేరిట లాల్ స్వామి (పీర్లచావిడీలో పీర్లను) కూర్చోబెట్టి ఫాతేహాలు సమర్పిస్తారు. ఆనాడు కర్బలా మైదానంలో ఇమాం హుస్సేన్ వారి కుటుం సభ్యులు ప్రజా స్వాన్యు పరిరక్షణకు చిందించిన రక్తపు చినుకులు వారి త్యాగనిరతిని ధర్మసేవా పరాయణతను తెలిపే మచ్చుతునకలుగా ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోవటంతో ఆ త్యాగమూర్తులను స్మరిస్తూ నివాళిగా పదిరోజులు పాటు జరుపుకుంటున్న సంస్మరణ మాసం మొహర్రం. చాగలమర్రి లో మొహ్రరం వేడుకలకు ప్రాధాన్యత రాయలసీమలో మొహర్రం పండుగ వేడుకలను షియా మతస్తులు సంతాప దినాలుగా పాటించినా సున్నీ తెగకు చెందిన ముస్లింలు, హిందువులు కూడా పీర్లపండుగ పేరిట చావిడీలలో పీర్లను కూర్చోబెట్టి ఫాతేహాలు సమర్పించి, తమ కోర్కెలు నెరవేరితే ముడుపులు చెల్లిస్తారు. రాయలసీమలో ఈ పండుగ పీర్ల పండుగగా పిలుస్తారు. నిర్వహించినట్లుగానే చాగలమర్రి ప్రజలు కూడా ఇక్కడ పదిరోజుల పాటు మొహర్రం వేడుకలను సంతాపదినాలుగా పాటిస్తూ వస్తున్నారు.

చాగలమర్రి గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఎప్పటిలాగే చాగలమర్రి లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మొహర్రం వేడుకలను కొనసాగిస్తున్నారు. మొహర్రం నెలలో నెల వంక కనిపించగానే స్థానిక ఆస్తానంలో నవాబుల వంశీకుడైన మీర్ ఫజిల్ అలీ ఖాన్ కర్బలా యుద్ధంలో వీరమరణం పొందిన హజ్రత్ ఇమాం హేస్సేన్ సోదరుడు హజరత్ అబ్బాస్ అలీ ఆలంలను నిలిపి పాతేహాలు సమర్పిస్తారు. పట్టణంలో ముస్లిం సోదరులే కాక హిందువులు కూడా చావిడీలలో పీర్లను కూర్చోబెట్టి పూజలు నిర్వహిస్తారు. ప్రధానంగా నెలవంక కనిపించిన ఏడవ రోజున చిన్న చిన్నమకానం లో ఉండే పీరు గుర్రం మీద స్వారీ చేస్తూ భక్తులకు దర్శనం ఇస్తాడు , ఎనిమిదో రోజున మధ్య సరిగేసు, తొమ్మిదో రోజున రాత్రి సవారీ పేరిట రాత్రి జరిగే వేడుకలు చూసేందుకు చుట్టు ప్రక్కన గ్రామాల ప్రజలు పెద్ద తరలి వస్తారు.”మొహార్రం నెల వచ్చిందంటే
ఎక్కడా చూసినా పీర్లచావిడీల వద్ద తప్పెట్ల చప్పుళ్లు, హసన్, హుస్సేన్ల నామస్మరణతో జన సందోహంతో ఊరేగింపులతో సందడిగా ఉంటుంది. కర్బలా యుద్ధంలో చివరగా యజీద్ సైన్యాన్ని ఎదిరించి హజ్రత్ ఇమాం హుస్సేన్ వీరమరణం చెందిన రోజును అషుర గా పాటిస్తారు. పదో రోజున లాల్ స్వామి కమిటీ సభ్యులు ముల్లా రఫీ ,సభ్యుల ఆధ్వర్యములో పురవీదుల గుండా ఊరేగిస్తారు. చివరి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైయ్యే ఈ మాతం ఊరేగింపు అస్తానం, పోలీస్ స్టేషన్ వీధి, పెద్ద మకాణం , గాంధీ సెంటర్ మీదుగా లాల్ స్వామి మకాణం చేరుకుని పిర్లపై నీళ్లు చల్లి దట్టీలను తిరిగి ఒక పెట్టెలో ఉంచడం పీర్ల పండుగ ప్రతీక ఆ తరువాత పండుగ ముగుస్తుందనీ భావిస్తారు. అయితే పీర్ల వెంట షియా ముస్లింలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కర్బలాలో యజీద్ సైన్యాన్ని ఎదుర్కొన్న హసన్ , హుస్సేన్ కుటుంబీకుల యుద్ధ సన్నివేశాలను తలచుకుంటూ గంధం నిర్వహిస్తారు. చివరి రోజు రాత్రి సవారీ , పగలు సవారీ ఊరేగింపు తిలకించేందుకు పెద్ద ఎత్తున హిందూ, ముస్లిం సోదరులు తరలివస్తారు. ప్రస్తుతం ఆంధ్రాలో జరిగే ఈ మొహరం వేడుకలకు చాగలమర్రి ద్వితీయ స్థానం అని చెప్పవచ్చు.

  • చాగలమర్రి గ్రామంలో పలు చోట్ల పీర్లను ఊరేగించే రోజుల వివరాలు
    లాల్ స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యములో జరిగే ఊరేగింపులు 1వ రోజు రాత్రి పెట్టెల ఊరేగింపు.
  • 6వ రోజు కోటగడ్డలోని హజరత్ హుర్ షహీద్ పీరు ఊరేగింపు.
  • 7వ రోజు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గల హజరత్ హసేన హజరత్ హుసేన్ పీర్ల ఊరేగింపు.
  • 8వ రోజు రాత్రి అరబ్ మస్జీద్ వద్ద గల హజరత్ అలీ అక్బర్ (గుర్రపు స్వామి )పీరు ఊరేగింపు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ 9వ రోజు రాత్రి, 10వ రోజు జియారత్ కార్యక్రమంతో మొహర్రం వేడుకలు ముగుస్తాయని అన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News