ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో టిడిపి రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా అన్నారు… పార్టీ పిలుపు మేరకు చాగలమర్రి గ్రామంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు.. ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ఆసహనంతో ఈ విధంగా అరెస్ట్ చెయ్యడం పిరికిపంద చర్య అని ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా అక్రమ అరెస్టును ఛేదించుకొని వస్తారన్నారు.
టిడిపి సీనియర్ నాయకుడు సల్లా నాగరాజు మాట్లాడుతూ.. ఈ దుర్మార్గపు ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి , చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా , టిడిపి నాయకులు సల్లా నాగరాజు , మోహన్ , కశినేని ఓబులేసు , బాలకృష్ణ , అలాంసా గారి హనీఫ్ , కొలిమి హుసేన్ వల్లి , షరీఫ్ , మౌలాలి , ఖలీల్ , ష్యాబుల్ , వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి , గఫార్ , సర్తాజ్ , సుబ్బారావు , రమేష్ , మధు , అశ్రఫ్ , బషీర్ , అబ్దుల్లా ,అజీమ్ , చోటు , హుసేన్ పీర , టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి గుత్తి నరసింహుడు , తదితరులు పాల్గొన్నారు…