Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

Chandrababu: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

దావోస్‌(Davos) పర్యటన నుంచి ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. తాజాగా నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై చర్చించారు. అలాగే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు.

- Advertisement -

ఇక అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ అందించే నిధుల అంశపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఆయనతో పాటు పలువురి కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad