Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Cm Chandrababu : ఆ అబ్బాయికి అదిరిపోయే గిఫ్ట్ పంపిన చంద్రబాబు .. ఎందుకంటే!

Cm Chandrababu : ఆ అబ్బాయికి అదిరిపోయే గిఫ్ట్ పంపిన చంద్రబాబు .. ఎందుకంటే!

Cm Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛతా ర్యాలీలో ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులు, స్థానికులతో కలిసి నడిచారు. ర్యాలీ అనంతరం మ్యాజిక్ డ్రైన్లను పరిశీలించి, వాటి నిర్మాణం, భూగర్భ జలాల పెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ గురించి పారిశుద్ధ్య సిబ్బందితో చర్చించారు. ఈ డ్రైన్లు పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు నీటి సరఫరాను పెంచుతాయని సిబ్బంది వివరించారు.

- Advertisement -

ALSO READ : Kolusu Parthasarathy : స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చీపురు పట్టిన మంత్రి కొలుసు పార్థసారథి

ర్యాలీ సందర్భంగా చంద్రబాబును చూసేందుకు భారీగా చేరుకున్న చిన్నారులతో ఆయన సరదాగా మాట్లాడారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు సెల్ఫీ దిగారు. ఒక బాలుడు ఆటోగ్రాఫ్ అడగగా, అతని చొక్కాపై సంతకం చేసి ఆనందపరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలుగుదేశం పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, చంద్రబాబును ‘పక్కింటి అంకుల్’గా అభివర్ణించి, చిన్నారుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

ALSO READ : Chandrababu : స్వర్ణాంధ్ర రావాలంటే అదొక్కటే దారి – సీఎం చంద్రబాబు

సభలో వైసీపీపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైసీపీ నకిలీ ప్రచారాలు, రౌడీ రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. గత పదేళ్లలో వైసీపీ కుట్రలను బట్టబయలు చేస్తూ, అమరావతిని మునిగిపోయిందని దుష్ప్రచారం చేసినట్లు విమర్శించారు. స్వచ్ఛత, సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad