ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పెన్షన్ల పింపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. ఆలయంలోని త్రికూటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
చంద్రబాబుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట ఏపీ టూరిజం అభివృద్ధి శాఖ వైస్ చైర్మన్, ఎండీ ఆమ్రపాలి ఉన్నారు. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, టీడీపీ మ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, అరవిందబాబు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.