Saturday, February 1, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: బడ్జెట్‌ను స్వాగతించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: బడ్జెట్‌ను స్వాగతించిన ఏపీ సీఎం చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)స్వాగతించారు. ఈ బడ్జెట్ ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని వికసిత్ భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను బడ్జెట్‌ గుర్తించింది. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్‌ కీలక అడుగులు సూచిస్తోంది. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపును ఇస్తుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా ఈ బడ్జెట్‌లో ఏపీలో పోలవరం ప్రాజెక్టుతో పాటు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ పోర్టు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయియించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News