టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) పుట్టినరోజు నేడు. దీంతో కూటమి నేతలు, కార్యకర్తలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా ఎక్స్ వేదికగా లోకేశ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ పోస్ట్ చేశారు.
‘‘తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మీ తపన ఎంతో హర్షణీయం. మీ ప్రయత్నాలన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ లోకేశ్’’ అని తెలిపారు.
కాగా 1983 జనవరి 23న హైదరాబాద్‌లో జన్మించిన లోకేశ్.. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అక్కడే కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేశారు. తర్వాత రాజకీయాల మీద శ్రద్ధతో ఇండియాకు తిరిగొచ్చారు. టీడీపీ యువ నేతగా, కార్యకర్తల సంక్షేమం కోసం కృష్టి చేశారు. 2014-19 మధ్య ఐటీ మంత్రిగా సేవలు అందించారు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో యువగళం పాదయాత్రతో క్యాడర్‌లో జోష్ నింపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా 91వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.