Saturday, June 29, 2024
Homeఆంధ్రప్రదేశ్CM CBN in Kuppam: ఆ చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు

CM CBN in Kuppam: ఆ చిన్నారికి నామకరణం చేసిన సీఎం చంద్రబాబు

ముద్దులొలికే పాపకు చరణిగా పేరు

సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సాగుతోంది. సొంత ఊరు కుప్పంలో ఆయనను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంలో ఓ చిన్నారిని సీఎం చంద్రబాబు చేతిలో ఉంచిన ఓ తల్లి తన బిడ్డకు నామకరణం చేసి ఆశీర్వదించాలని కోరగా చంద్రబాబు ఆ పాపకు చరణిగా నామకరణం చేశారు.

- Advertisement -

వివరాలలోకి వెళితే…

శాంతిపురం మండలంనకు చెందిన సుధాకర్, ప్రియ దంపతుల రెండవ కుమార్తె చిన్నారికి ‌‌చరణి గా నామకరణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా.. కుప్పం లో రెండవ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆర్&బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలం నకు చెందిన సుధాకర్, ప్రియ దంపతుల రెండవ కుమార్తె చిన్నారి కి నామకరణం చేయవలసిందిగా కోరగా… ముద్దులొలికే చిన్నారిని తీసుకొని “చరణి” గా నామకరణం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News